శివరాత్రి పర్వదినం సందర్భంగా ''బుగ్గ జాతరలో'' ఉచిత త్రాగునీరు కార్యక్రమం

విలకలాంగులు (దివ్యాంగులు) సైతం సేవలో,,,''సంతోష్'' గారు మరియు ''వేణు గోపాల్'' గారు 
ఇద్దరు సంయుక్తంగా ''ఒకటవ వాటర్ క్యాంప్'' ని విజయవంతంగా నిర్వహించారు. 
వికలాంగులు ఐనప్పటికీ ప్రజలకి సేవ చేయాలి అనే వీళ్ళ యొక్క సంకల్పానికి ప్రతీ ఒక్కరు శిరసాభివందనాలు చేయాలి.శరీర అవయవాళ్ళు అన్ని సక్రమంగా ఉన్నవాళ్ళని సేవా కార్యక్రమాలకిరావాలని చాలా మందిని అడిగాను ఒక్కరు కూడా రాలేదు.కాని నేను పిలవకుండానే facebook లో చూసి స్పందించి స్వచ్చందంగా సేవ చేయడానికి వచ్చిన ,''సంతోష్'' గారికి మరియు ''వేణు''గారికి నా యొక్క శిరసాభివందనాలు.మీలాంటి గొప్ప సేవా భావం చాలా మందికి ఆదర్శంగా నిలిచింది.మీ యొక్క సహాయ సహకారాలు మాకు ఎల్లపుడూ ఉండాలని ఆశిస్తూ మీ యొక్క సేవకు మేము సదా రుణపడి ఉన్నాము.

సేవని అందించడానికై వాలంటీర్లుగా దంపతులు. ''జయరాజ్ మరియు స్రవంతి'' 

''భార్యా భర్తలు'' ఇద్దరు స్వచ్చందంగా తమయొక్క సేవా భావాన్ని చాటుతూ మరియు సేవా సంస్థకి తమ యొక్క సహాయ సహకారాలను అందించారు.ఉదయం 8 గంటలనుండి రాత్రి వరకి భక్తులకి త్రాగునీరు అందించారు.మరియు ''మొబైల్ వాటర్ సర్వీస్''ని విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించారు.

దైవ దర్శనానికై ''క్యూ''లో వేచిఉన్న భక్తులకి మరియు దేవాలయం ప్రాంగణంలో విధులు నిర్వహించినటువంటి పోలీసులకి త్రాగునీరు అందించారు.చాలా మంది దంపతులకి ఆదర్శంగా నిలిచారు.
వారి యొక్క సహాయ సహకారాలు ఎల్లపుడూ మా సేవా సంస్థకి ఉండాలని కోరుకుంటూ ''జయరాజ్ మరియు స్రవంతి'' గార్లకి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు.

''సలీం అహ్మద్'' గారు (సంగీత్ మొబైల్స్ ,బెల్లంపల్లి) ,,,
''శివరాత్రి" రోజు భక్తులకోరకు ఏర్పాటు చేసిన ''ఉచిత త్రాగునీరు'' కార్యక్రమం మరియు ''మొబైల్ వాటర్ సర్విస్'' విజయవంతం కావడానికి ప్రధాన కారకులు ''సలీం అహ్మద్''

విజయ సేవా సంస్థకి ఎల్లపుడూ వారియొక్క సహాయ సహకారాలను అందిస్తూ కమిటీ సభ్యులను ప్రోత్సహిస్తూ ఉంటారు.సేవాసమితికి కావాల్సిన ప్రతి ఒక్కటి సమకూరుస్తారు.
2015 సంవత్సరం నుండి ఇప్పటివరకి నిర్వహించిన కార్యక్రమాలు విజయవంతం కావడానికి ప్రదానకారకులు.గత సంవత్సరకాలం నుండి సేవా సంస్థకి వారియొక్క సహకారాలు అందిస్తూ సేవా భావాన్ని చాటుతున్నారు.మీ యొక్క సహాయం మాకు ఎల్లపుడూ ఉండాలని ఆశిస్తూ మీ యొక్క ఆదరణకి మేము సదా ఋణ పడి ఉన్నాము.మీకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు.
రెండవ వాటర్ క్యాంపు దగ్గర 
ఫ్రీ మొబైల్ వాటర్ సర్వీస్ నిర్వహిస్తున్న మా సేవా సంస్థ సభ్యులతో ,,,

''శివరాత్రి'' సందర్భంగా బుగ్గ జాతరలో భక్తుల కొరకు 2 ఉచిత త్రాగునీరు చలివేంద్రములతో పాటు ఫ్రీ మొబైల్ వాటర్ సర్వీస్ ద్వారా నీటిని పంపిణీ చేయడంలో వాళ్ళ యొక్క సేవా గుణాన్ని చాటుకున్న మా యొక్క సేవా సంస్థ సభ్యులకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు.
ఒకటవ వాటర్ క్యాంపు దగ్గర 
మొబైల్ వాటర్ సర్వీస్ నిర్వహిస్తున్న మా సేవా సంస్థ సభ్యులతో ,,,

''శివరాత్రి'' సందర్భంగా బుగ్గ జాతరలో భక్తుల కొరకు 2 ఉచిత త్రాగునీరు చలివేంద్రములతో పాటు ఫ్రీ మొబైల్ వాటర్ సర్వీస్ ద్వారా నీటిని పంపిణీ చేయడంలో వాళ్ళ యొక్క సేవా గుణాన్ని చాటుకున్న మా యొక్క సేవా సంస్థ సభ్యులకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు.
విజయ్ సేన